ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి వినాయక చవితి పండుగ సందర్భంగా మట్టి విగ్రహాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నారు. వాతావరణ కాలుష్యం అరికట్టడానికి ఈ మట్టి విగ్రహాలు దోహదపడతాయని పేర్కొన్నారు.