విజయనగరం జిల్లా రామబద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పారాది బ్రిడ్జి వద్ద బుధవారం సాయంత్రం మోటార్ బైక్, లారీ బలంగా ఢీకొన్న ఘటనలో మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న బొబ్బిలి మండలం పారాది గ్రామానికి చెందిన పువ్వుల బాలాజీ అక్కడే మృతి చెందాడు. బాలాజీ బొబ్బిలి నుంచి రామభద్ర పురానికి మోటార్ బైక్ పై వస్తుండగా పారాది బ్రిడ్జి వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న రాంభద్రాపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.