మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి శనివారం మాట్లాడుతూ, అమరావతిపై వైసీపీ యూటర్న్ తీసుకోవడం జగన్ దివాలాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. గతంలో అమరావతిని స్మశానంతో పోల్చిన వైసీపీ ఇప్పుడు దానిని రాజధానిగా సమర్థించడం రాజకీయ దురాలోచన అని ఆయన అన్నారు. మూడు రాజధానుల పేరుతో ఐదేళ్లు వృథా చేశారని, ప్రజలు ఇక వైసీపీని నమ్మరని ఆయన స్పష్టం చేశారు.