సిర్పూర్ టి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో పోలీస్ కమ్యూనిటీ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో గార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో తనిఖీలు నిర్వహించి సరైన ధ్రువీకరణ పత్రాలు లేని పలు వాహనాలను సీజ్ చేశారు. గ్రామంలో నిర్వహిస్తున్న గుడుంబా స్థావరాలపై దాడి నిర్వహించి బెల్లం పానకం ధ్వంసం చేసి గుడుంబాను స్వాధీన పరుచుకున్నట్లు సిర్పూర్ టి ఎస్ ఐ కమలాకర్ తెలిపారు. గ్రామంలో అసంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు,