రాయదుర్గం పట్టణంలో నూతన ప్రతిపాదించబడిన బార్ ఏర్పాటు కోసం ఆసక్తి గల అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవాలని రాయదుర్గం ఎక్సైజ్ ఇనిస్పెక్టర్ మహేష్ కుమార్ గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈనెల 26 లోపు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవచ్చన్నారు. బార్ లైసన్సు ఫీజు 55 లక్షలు, అప్లికేషన్ రుసుము 5 లక్షలు గా నిర్ణయించినాడు తెలిపారు. లైసన్సు ఫీజు 6 సులభ వాయిదాలలో చెల్లించే వెసులుబాటును కల్పించినట్లు వెల్లడించారు.