కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని చింతకొమ్మదిన్నె మండలం పబ్బాపురం వద్ద ఈ నెల 27, 28, 29 తేదీలలో జరగనున్న మహానాడు ఏర్పాట్లని శుక్రవారం సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, పరిశీలించినట్లు నాయకులు తెలిపారు. ఆయనతో పాటు పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాం గోపాల్ రెడ్డి, పేరాబాత్తుల రాజశేఖర్, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్య ప్రకాష్, బెంగుళూరు టిడిపి ఫోరమ్ అధ్యక్షులు కనకమేడల వీర, ఐటిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సోంపల్లి వీర తదితరులు పరిశీలించారు.