అస్వస్థతకు గురైన వారికి ఎమ్మెల్సీ పరామర్శ తిరుపతి: రేణిగుంట మండలం గుత్తివారిపల్లిలో కలరా వ్యాప్తి చెందడంతో దాదాపు 60 మంది అస్వస్థతకు గురై బాలాజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించి పండ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. నీటి కాలుష్యం కారణంగానే వ్యాధి సోకిందని, ఇది అధికారుల నిర్లక్ష్యమేనని పేర్కొంటూ మరిగించిన నీటినే తాగాలని ప్రజలకు సూచించారు.