నల్లగొండ జిల్లా కేంద్రంలోని సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక సమస్యలను పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నల్లగొండ పట్టణ సిపిఎం కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ మున్సిపాలిటీలను విలిన ప్రాంతాలలో మంచినీటి సమస్యలతో పాటు డ్రైనేజీ వ్యవస్థ స్థానిక సమస్యలను పరిష్కరించాలని, అర్హులైన పేదలందరికీ నూతన పెన్షన్లను మంజూరు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎండి సలీం ,తుమ్మల పద్మ, సరోజ తదితరులు పాల్గొన్నారు.