రాష్ట్రంలో ఎరువుల కొరతతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని నంద్యాల ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు అమీర్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం ఈ విషయంపై నంద్యాలలోని వైసీపీ కార్యాలయంలో మాట్లాడారు. రైతే రాజు జై జవాన్ జై కిసాన్ అంటూ రైతులను దేశ ప్రజలు గుర్తిస్తే.. నేడు కూటమి రైతులకు సకాలంలో ఎరువులను, సాగునీటిని అందించలేక రైతన్నలను నష్టాలు, కష్టాల్లోకి నెడుతున్నారని విమర్శించారు.