జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు శుక్రవారం రాత్రి నుంచి కనిపించని విషయం తెలిసిందే. మధ్యాహ్నపువారి గూడెం కాలువలో ఆదివారం ఉదయం ఆయన బైక్ గుర్తించారు. ఈక్రమంలో గజ ఈతగాళ్లతో వాగు మొత్తం గాలించారు.కానిస్టేబుల్ మృతదేహాన్ని గుర్తించి మధ్యాహ్నం రెండు గంటలకు బయటకు తీశారు.. కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు వాగులో గల్లంతయ్యి మృతి చెందాడ ఏదైనా ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..