రాయచోటి కలెక్టరేట్ ఎదుట ఏపీ వికలాంగుల జేఏసీ ఆధ్వర్యంలో దివ్యాంగులు సోమవారం ధర్నా చేశారు.దివ్యాంగులకు మద్దతుగా వైసీపీ రాష్ట్ర దివ్యాంగుల విభాగం ప్రధాన కార్యదర్శి సుధాకర్, రాష్ట్ర బూత్ కమిటీ సెక్రటరీ రెహమాన్ ఖాన్, రాయచోటి నియోజకవర్గ దివ్యాంగుల విభాగ అధ్యక్షుడు బాలాజీ ఆందోళనలో పాల్గొన్నారు. అర్హులైన దివ్యాంగుల పింఛన్లు తొలగించడం సరికాదన్నారు.