నేడు మరల తెరుచుకొనున్న నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు... నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు నేడు మరల తెరుచుకొనున్నాయి. గురువారం ప్రాజెక్ట్ ఏఈ సాకేత్ మాట్లాడుతూ ప్రధాన వరద గేట్ల ద్వారా మంజిరాలోకి సుమారు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నామని అన్నారు. ప్రాజెక్ట్ గేట్లను ఎత్తనుండడంతో మంజీర నది పరివాహక ప్రాంతం ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మంజీర నదిలో పరివాహక ప్రాంతంలోకి ఎవరు కూడా వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.