ASF మండలం రాజుర గ్రామ సమీపంలోని కల్వర్టు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నది కల్వర్టుకు ఇరువైపులా రోడ్డు కూతకు గురైంది దీంతో వాహనాలు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది శుక్రవారం ఉదయం పాఠశాలకు వెళ్ళే వాహనం వెళ్లలేని పరిస్థితి నెలకొంది దీంతో విద్యార్ధులు వాహనం దిగి చుట్టూ పక్కల ఉన్న చిన్న చిన్న బండరాళ్లను సేకరించి కోతకు గురైన గుంతల్లో వేసి వాహనానికి దారి చేసుకున్నారు. ఇంఛార్జి మంత్రి చెప్పిన కూడ అధికారులు మరమత్తులు చేపట్టకుండా తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం పట్ల గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్ధులు పాఠశాలకు ఎలా వెళ్ళాలని ప్రశ్నిస్తున్నారు.