చిప్పగిరిలోని బంటనహల్, కొట్టల, కాజీపురం, గుమ్మనూరు గ్రామాల నుంచి ప్రతిరోజూ వందలాది మంది విద్యార్థులు గుంతకల్లు, చిప్పగిరి పట్టణాలకు చదువుకోడానికి ప్రయాణిస్తున్నారు. అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల రద్దీ ఎక్కువై విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని శుక్రవారం గ్రామస్తులు విద్యార్థులు తెలిపారు . రద్దీ కారణంగా పాఠశాలలకు సరిగ్గా హాజరు కాలేకపోతున్నామని కొందరు విద్యార్థులు వాపోయారు. అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు