నల్లగొండ జిల్లా ఇటుకులపాడు గ్రామంలోని గ్రామ ఎంప్లాయ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఉభయ పాఠశాలలకు లక్ష 50 వేల రూపాయల విలువ కలిగిన విద్యార్థులకు ఉపయోగపడే మెటీరియల్స్ ను ఆదివారం అందజేశారు. సమావేశాన్ని ఉద్దేశించి మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ పోడిటి చంద్రయ్య మాట్లాడుతూ విద్యార్థులు మంచి మార్గం వైపు వెళ్లేలా ఉపాధ్యాయులు తెలిపిన సూచనలను తూచా తప్పకుండా పాటించి ప్రణాళిక బద్ధంగా చదివితే తమ లక్ష్యాన్ని చేరవచ్చు అన్నారు.CRDO, DRDO సీనియర్ సైంటిస్ట్ రామస్వామి యాదగిరి మండల విద్యాధికారి మందుల సైదులు డిఆర్డిఏ,డిపిఎం పెరమాండ్ల వీరయ్య ఉభయ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామాచారి, సుల్తాన్ ఎల్లయ్య పాల్గొన్నారు.