ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోన అటవీ ప్రాంతంలోని గెస్ట్ హౌస్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సోమవారం సాయంత్రం6 గంటల ప్రాంతంలో పేర్కొన్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.