పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ASF పట్టణంలో బుధవారం సీఐ బాలాజీ వరప్రసాద్ చేతుల మీదుగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐ బాలాజీ వరప్రసాద్ మాట్లాడుతూ..రసాయనాతో తయారు చేసిన విగ్రహాలను కాకుండా మట్టితో చేసిన వాటినే పూజించాలని ఆయన సూచించారు. మట్టి విగ్రహాలతో వాయు,నీటి కాలుష్యాన్ని నివారించవచ్చని ఆయన సూచించారు.