కాట్రేనికోన తహసీల్దార్ కార్యాలయం సమీపంలో అన్నా క్యాంటీన్ భవన నిర్మాణానికి ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు శంకుస్థాపన చేశారు. కూటమి నాయకులతో కలిసి కొబ్బరి కాయ కొట్టారు. అనంతరం సుబ్బరాజు మాట్లాడుతూ ప్రతి పేదవాడి ఆకలి తీర్చేందుకు సీఎం చంద్రబాబు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం అన్నా క్యాంటీన్ అని అన్నారు. త్వరితగతిన అన్న క్యాంటీన్ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు