శ్రీకాళహస్తిలో ఎరువు దుకాణాల తనిఖీ శ్రీకాళహస్తిలోని పలు ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద్ రావు, టూ టౌన్ సీఐ నాగార్జున రెడ్డితో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిల్వ ఉన్న యూరియా, దుకాణా లైసెన్స్లను పరిశీలించారు. రైతులకు వారు సాగు చేసిన పంట విస్తీర్ణాన్ని ఆధారంగా చేసుకొని ఎరువులు అమ్మకాలు చేపట్టాలని దుకాణదారులకు సూచించారు. ఆధార్ కార్డు ద్వారా ఆన్లైన్ పద్ధతిలోనే విక్రయించాలని తెలియజేశారు.