తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి బుధవారం రాత్రి అశ్వాహన సేవలో కళాబృందాలు ప్రదర్శించిన ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి తొమ్మిది రాష్ట్రాల నుంచి వచ్చిన 21 బృందాలకు చెందిన 539 మంది కళాకారులు తమ ప్రదర్శనతో ఆలరించారు జానపద సాంప్రదాయ నృత్యాలు కోలాటం నృత్యాలు ఉత్సవ వాతావరణాన్ని మరింత పెంచాయి గురువారం చక్రస్నానంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.