పామర్రులో మినుముల దొంగల అరెస్టు: ఎస్సై రాజేంద్రప్రసాద్ స్తానిక పామర్రులో మినుముల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 4న వీర వెంకట సత్యనారాయణ అనే వ్యాపారికి చెందిన 40 బస్తాల మినుములను దొంగిలించిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారివద్ద నుంచి మినుములతో పాటు, చోరీకి ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నట్లు గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో పామర్రు పొలీస్ స్టేషన్ ఎస్సై రాజేంద్రప్రసాద్ మీడియాకు తెలియజేశారు.