ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో మహిళా సాధికారత విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కే దక్కుతుందన్నారు. అమ్మకు వందనం పథకంలో భాగంగా ఇంటిలో ఉన్న ప్రతి బిడ్డకు లబ్ధి చేకూరింది అన్నారు. ప్రతి మహిళకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు.