Download Now Banner

This browser does not support the video element.

విజయనగరం: ప్రియురాలితో కలిసి భార్యకు విషం తాగించిన భర్త, రాజాం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు

Vizianagaram, Vizianagaram | Sep 5, 2025
ప్రియురాలితో కలిసి కట్టుకున్న భర్తే తనను చంపడానికి ప్రయత్నించాడని ఓ బాధిత మహిళ శుక్రవారం వాపోయింది. విజయనగరం జిల్లా వంగర మండలంలోని జగన్నాథవలసకి చెందిన చిన్నారావు, సాయికుమారికి ఈ ఏడాది ఫిబ్రవరి 16న పెళ్లి అయింది. తన భర్తకు వివాహేతర సంబంధం ఉండడంతో తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవని బాధితరాలు తెలిపింది. ఈ క్రమంలోనే గురువారం రాత్రి 10 గంటలకు ప్రియురాలితో కలిసి బలవంతంగా తనతో గడ్డిమందు తాగించారని చెప్పింది. ప్రస్తుతం బాధితురాలు రాజాంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలు మరియు కుటుంబ సభ్యులు ఏమన్నారో ఈ వీడియోలో చూడొచ్చు.
Read More News
T & CPrivacy PolicyContact Us