ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఎలాంటి ఎరువుల కొరత లేదని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు. రైతులు ఎవరు కూడా యూరియా కొరత ఉందని ఇబ్బందులు పడలేదు. రైతు భరోసా కేంద్రాలలో యూరియా నిల్వలు ఉన్నాయని కావలసిన రైతులకు అందుబాటులో ఉంటుందన్నారు. ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. వైసీపీ నాయకులు లేనిది కల్పించి నిరసన చేయడం పద్ధతి కాదన్నారు. కూటమి ప్రభుత్వం లో సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశామన్నారు.