జిల్లాలో కౌలు రైతులకు పంట రుణాలతో పాటు, పేద ప్రజల ఆర్థిక అభివృద్ధికి స్వయం ఉపాధి, పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరుకు బ్యాంకర్లు చిత్తశుద్ధితో పనిచేయాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఎస్.ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన బ్యాంకర్ల జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాల్గొన్నారు.