ఉల్లి రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం కర్నూలు కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతు సంఘం నాయకుడు జగన్నాథం మాట్లాడుతూ... కర్నూలు జిల్లాలో ఉల్లి పంట పండించిన రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్పత్తి ఖర్చులు పెరిగినా మార్కెట్‌లో ఉల్లికి సరైన ధర రాకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.3 వేలుగా నిర్ణయించి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు