క్రమశిక్షణతో పార్టీని నమ్ముకుని పని చేస్తే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చన్నదానికి నిదర్శనం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని తన క్యాంపు కార్యాయలం ప్రజా సేవాభవన్ లో టీపీసీసీ రథ సారథి పుట్టిన రోజు వేడుకలను నియోజక వర్గ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పండగలా జరుపుకున్నారు. హాజరైన కాంగ్రెస్ శ్రేణులు, మహేష్ కుమార్ గౌడ్ కటౌట్ మధ్య భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.