సారంగపూర్ మండలంలోని బతుకమ్మ కుంట అధిక వర్షాలతో డ్యామేజ్ అయిన బతుకమ్మ కుంట చెరువు మత్తడిని ఆదివారం మధ్యాహ్నం 4గంటల ప్రాంతంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన అటవీ శాఖ అధికారులతో ఫోన్ లో మాట్లాడుతూ.. డ్యామేజ్ అయిన మత్తడి నిర్మాణం వెంటనే చేపట్టాలి ఫ్లడ్ డ్యామేజ్ అయిన వాటి మరమ్మత్తులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది వెంటనే మంత్రి గారికి కలెక్టర్ దృష్టికి తీసుకెల్లి మత్తడి నిర్మాణ పనులకు నిధులు మంజూరు అయ్యేలా చూస్తా అని అన్నారు.సారంగపూర్ బతుకమ్మ కుంట ఒక పర్యాటక కేంద్రంగా మారింది యూట్యూబ్ సాంగ్స్ వెడ్డింగ్ షూట్స్ కి స్పాట్ గా మారింది బతుకమ్మ కుంట....