పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని దండిగాం రోడ్ లో నిర్మించిన రైతు బజార్ ను వినియోగంలోనికి తీసుకు వచ్చేలా చర్యలు తీసుకుంటామని సాలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖీ సూర్యనారాయణ స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం సాలూరు పట్టణంలోని ఏఎంసి కార్యాలయంలో ఏఎంసీ డైరెక్టర్లు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ సూర్యనారాయణ మాట్లాడుతూ దీనివల్ల కొనుగోలుదారులకు తక్కువ ధరకు కాయగూరలు లభిస్తాయన్నారు. అలాగే పంట పొలాలకు వెళ్లేందుకు అవసరమైన లింక్ రోడ్ల అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు అందివ్వాలన్నారు.