భూ సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టంలో భాగంగా రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం ASF కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు, జిల్లా సర్వే ల్యాండ్ అసిస్టెంట్ డైరెక్టర్ సోమేశ్వర్ లతో కలిసి తహసిల్దార్లు, నాయబ్ తహసిల్దార్లు, మండల సర్వేయర్లు, గిర్ధవార్లు, కంప్యూటర్ ఆపరేటర్లతో భూభారతి దరఖాస్తుల పరిష్కారంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.