ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు సమయానికి రుణాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశాన్ని అదనపు కలెక్టర్ దేవ సహాయంతో కలిసి నిర్వహించారు.