జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు అంబేద్కర్ కాలనీల లో గురువారం ఉదయం నుండి కురుస్తున్న వర్షానికి డ్రైనేజీలు నుండి రోడ్డుపై ప్రవహిస్తూ ఇళ్లలోకి నీరు చేరింది దీంతో ప్రజలు సామాన్లు సర్దుకుని నానా తంటాలు పడ్డారు ఎడతెరపి లేకుండా ఉదయం నుండి కురుస్తున్న వర్షానికి డ్రైనేజీలు పూర్తిగా నిండిపోయాయి. ఇంకా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. అయితే అధికారులు మాత్రం ఎవరు ఆందోళన పడవద్దని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అత్యవసరం అయితే వెంటనే ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు