ఏసీఏ కార్యాలయంలో మహిళా క్రికెట్ ప్రపంచ కప్ వివరాలను ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఏ.సి.ఏ సెక్రటరీ శానా సతీష్ బాబు మాట్లాడుతూ ఉమెన్స్ వరల్డ్ కప్ విశాఖలో జరగడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఈ మ్యాచ్ లు అక్టోబర్ 5 నుంచి జరగనున్నాయి. దీనికి సంబంధించి ఆదివారం ట్రోపిని ప్రదర్శించడం జరిగింది అన్నారు. ఇండియాతో పాటుగా ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్ టీంలు ఆడనున్నాయి అన్నారు. విశాఖ ప్రజలు అందరు కూడా ఈ మ్యాచ్ లను ఆదరించాలన్నారు. ఇటీవల మంత్రి లోకేష్ మహిళా జట్టు సభ్యులను కలిశారని అన్నారు.