భద్రాచలం పట్టణంలో రవాణా శాఖ కార్యాలయం వద్ద మంగళవారం ఎక్స్చేంజ్ అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా అక్కడికి వచ్చిన ఓ స్కూటీని తనిఖీ చేయగా 4.11 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి తరలిస్తున్న యూసఫ్, దుర్గారావు, శ్రీహరి నిందితులను అరెస్టు చేసి, గంజాయి, స్కూటీలను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు