ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా అధికారులు ప్రజాప్రతినిధులు చూడాలని ఎంపీపీ శ్రీదేవి అన్నారు. మంగళవారం మండల కేంద్రము కలకడలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ శ్రీదేవి అధ్యక్షతన మండల సర్వ సభ్య సమావేశాన్ని ఎంపిడిఓ భాను ప్రసాద్ చేపట్టారు. మండలంలోని అధికారులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యలు ఉన్నాయని పరిష్కరించాలని బాలయ్యగారి పల్లి సర్పంచ్ విశ్వనాథ్ తెలిపారు.ఎంపీపీ శ్రీదేవి మాట్లాడుతూ సమస్యలు కోరి వచ్చే ప్రజల పట్ల కొందరు అధికారులు గౌరవ ప్రధంగా మెలిగి పరిష్కరించాలన్నారు