ఆనాడు గోదావరి నదిపై అడ్డగోలుగా ప్రాజెక్టులు కట్టి తెలంగాణకు నీళ్లు రాని పరిస్థితిలో కేసీఆర్ ముందుచూపుతో కాలేశ్వరం పూర్తి చేస్తే తెలంగాణ సస్యశ్యామలమైనదని కాలేశ్వరం పై తప్పుడు ప్రచారాలు చేసే ప్రజల ఊరుకోరని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో కాలేశ్వరంపై వీడియో ప్రజెంటేషన్ నిర్వహించగా కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి తో పాటు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ హాజరయ్యారు.