కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని యోగి వేమన విశ్వవిద్యాలయం మెయిన్ గేటు వద్ద శనివారం టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన తెలిపారు. స్నాతకోత్సవం, వసతి గృహాల సమస్యలను పరిష్కరించడంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా విద్యార్థి నాయకులతో మాట్లాడిన రిజిస్టార్ పద్మ, పది రోజల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.