జమ్మికుంట: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న ఆధ్వర్యంలో పాలకవర్గం సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత మూడు నెలల ఆదయ వ్యయాలను సమీక్షించుట కాటన్ మార్కెట్ యార్డులో రైతులకు సరుకుల రేట్లు తెలియజేసే డిజిటల్ బోర్డుల ఏర్పాటు చేయుట అదేవిధంగా ప్రహరీ గోడకు అవసరమైన మేరకు మరమ్మత్తులు చేయడం కోసం మొదలైన ప్రతిపాదనలు పంపడం గురించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ అంశాలతో పాటు పలు అంశాలపై చైర్ పర్సన్ స్వప్న ఆమోదంతో చర్చించడం జరిగింది అన్నారు.