బందరులో జనసేన గూండాల దాడిలో గాయపడిన బాధితులకు వైఎస్ జగన్ ఫోన్ లో పరామర్శ... గతరాత్రి స్తానిక మచిలీపట్నం మండలంలోని సత్రపాలెంలోని ఆర్ఎంపీ వైద్యుడు గిరిధర్, సతీష్ ల పై జనసేన గూండాల దాడి లో గాయపడి, స్తానిక ప్రభుత్వ అసుపత్రిలో చికిత్చ పొందుతున్న వారిని ఆంద్రప్రదేశ్ వైసిపి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్ లో పరామర్సించారు. రాజకీయాలు ఇంతలా దిగజారిపోవడం బాధాకరమని జగన్ అన్నారు. తనను కులం పేరుతో దూషించి కొట్టారని వైఎస్ జగన్ కు సతీష్ చెప్పాడు. అలాగె తన షాపును ధ్వంసం చేశారని తనకు జరిగిన అన్యాయాన్ని వైఎస్ జగన్ కు సతీష్ చెప్పుకున్నాడు.