అనంతపురం నగర శివారులోని సాయిబాబా ఆలయం వద్ద ద్విచక్ర వాహనం ఆటో ఢీకొన్న ఘటనలో వెంకటాపురం గ్రామానికి చెందిన మునెప్ప అనే యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన యువకుడిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.