పన్నులు చెల్లించి నగరపాలక అభివృద్ధికి సహకరించాలని కమీషనర్ విశ్వనాథ్ సూచించారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఓ వీడియో ద్వారా మాట్లాడారు. కర్నూలు నగర ప్రజలు ఆస్తి పన్నులు, కొళాయి ఛార్జీలు, అలాగే వ్యాపారస్థులు తమ ట్రేడ్ లైసెన్స్ రుసుముల బకాయిలను సెప్టెంబర్ 30వ తేదీ లోపు చెల్లించి.. అపరాధ రుసుము నుంచి మినహాయింపు పొందాలన్నారు. పన్నులను పురమిత్ర యాప్, సమీప సచివాలయం, ఆన్లైన్ సేవా కేంద్రాలు, లేదా నగరపాలక సంస్థ కార్యాలయంలో చెల్లించాలని తెలిపారు