గద్వాల్ పట్టణంలోని సెకండ్ రైల్వే గేట్ను ఆదివారం మధ్యాహ్నం రైల్వే అధికారులు మూసివేశారు. రైల్వే గేట్ వద్ద పునరుద్ధరణ పనులు చేస్తున్న నేపథ్యంలో ఈనెల 17 వరకు పది రోజులపాటు గేటు మూసివేస్తున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించి గేటు వద్ద సూచిక బోర్డు ఏర్పాటు చేశారు. అప్పటివరకు ఆ మార్గం గుండా వెళ్లే వాహనాలు మొదటి రైల్వే గేట్ ROB మీదుగా ప్రయాణించాలని రైల్వే అధికారులు సూచించారు.