చరిత్రను వక్రీకరిస్తే తెలంగాణ జాతి క్షమించదని సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు తెలిపారు. తెలంగాణ పోరాటాన్ని మతపరమైన పోరాటంగా చిత్రీకరించేందుకు బిజెపి ప్రయత్నిస్తుందని స్వాతంత్య్ర ఉద్యమంలోనూ, తెలంగాణ పోరాటంలో బిజెపికి ఎటువంటి పాత్ర లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ప్రారంభ సందర్భంగా పాత బస్టాండ్ సమీపంలోని సాయుధ పోరాటయోధుడు, సిపిఐ అగ్ర నాయకులు నల్లమల గిరిప్రసాద్ విగ్రహానికి పూలమాలలు -వేసి వార్షికోత్సవాలను హేమంతరావు ప్రారంభించారు.