తెలంగాణ ప్రాంతంలో భారీగా కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో తమ్మిలేరులో వరద ఉధృతంగా ప్రవేశిస్తుంది ఈ నేపథ్యంలోనే ఏలూరులోని పడమర తూర్పు లాకులు వద్ద నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు ఇరిగేషన్ అధికారులు.. పడమరలాకులోని కొన్ని గేట్లు తుప్పు పట్టి స్టక్ అవడంతో క్రేన్ సహాయంతో గేట్లను ఎత్తే ప్రక్రియ చేపట్టారు.. అయితే గేట్లు తుప్పు పట్టి విరిగిపోవడంతో పడమర లేకుండా ప్రమాదంలో ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.. అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు..