కపిలేశ్వరపురం మండలం కేదార్లంక గ్రామ పంచాయితీ వీధివారి లంకకు చెందిన పల్లిచిట్టియ్య (65) తాతపూడి లంకకు వెళ్లి మరలా తిరిగి రాలేదు. లంకలోకి వెళ్ళి ప్రమాదవశాత్తు గోదావరి ప్రవాహంలో కొట్టుకొని పోయి వుంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న కపిలేశ్వరపురం తహసిల్దార్ శ్రీనివాస్, రూరల్ సిఐ దొరరాజు ఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లను రప్పించి పడవలపై గోదావరిలో గురువారం గాలింపు చర్యలు చేపట్టారు.