కాకినాడజిల్లా కోటనందూరు నుంచి వైసీపీని విడనాడి 200 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరినట్లు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలియజేశారు. తేటగుంట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ కండువా కప్పి వీరందర్నీ పార్టీలోకి ఆహ్వానించినట్లు యనములతో పాటు ఎమ్మెల్యే యనమల దివ్య సైతం తెలియజేశారు. కూటమి ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని గ్రహించి పార్టీలోకి చేరడం శుభదాయకం అంటూ ఎమ్మెల్యే అన్నారు