విద్యుత్ షాక్ తో ఎద్దు మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలో ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం బాధిత రైతు రోషన్ తెలిపిన వివరాలు ప్రకారం.. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని బసిరెడ్డిపల్లి గ్రామంలో రోషన్ ఎద్దు వేస్తూ ట్రాన్స్పోర్ట్ దగ్గరకు వెళ్లిన తర్వాత విద్యుత్ షాక్ తో మృతి చెందటం జరిగిందని వాపోయాడు. ట్రాన్స్ఫార్మర్ కు కంచ లేకపోవడంతో ప్రమాదం సంభవించింది అన్నారు. దీంతో రైతు కన్నీరు మున్నీరు అయ్యారు. ఎద్దు విలువ 80 వేల రూపాయలు ఉంటుందని, సంబంధిత అధికారులు గ్రామానికి వచ్చి చూసి నష్టపరిహారం వచ్చే విధంగా చూడాలన్నారు