విద్యుత్ షాక్కు గురై ఓ యువరైతు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కడెం మండలం కొండుకూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం కొండుకూర్ గ్రామానికి ఓ రైతుకు చెందిన వరి పొలంలో సంగెం రాజు అనే యువరైతు మిషన్ తో గడ్డి కొస్తుండగా విద్యుత్ మోటార్ సమీపంలోని ఐ వోల్టేజ్ విద్యుత్ వైర్ కు తగిలి సంగెం రాజు విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రాజు కుటుంబీకులు ఘటన స్థలం వద్ద కన్నీరు మున్నిరవుతున్నరు.. ఘటన స్థలాన్ని కడెం పోలీసులు సందర్శించి ప్రమాదం పట్ల విచారణ చేపడుతున్నారు..