సత్యసాయి జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలో శక్తి యాప్పై పుట్టపర్తి మహిళా పీఎస్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఆదినారాయణ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ రత్న ఆదేశాలతో విస్తృతంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం మహిళలు, విద్యార్థులు స్మార్ట్ ఫోన్లలో శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్రమాద సమయంలో వినియోగించుకోవాలని తెలిపారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఫోక్సో చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.