తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న నూతన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం మండలం లోని వల్లూరు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పథకాలకు సంబంధించిన రైతు భరోసా 397, కొత్త రేషన్ కార్డులు 51, ఇందిరమ్మ ఇల్లు 125, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 41 మంది లబ్దిదారులకు మండల ఎంపీడీవో ఆనంద్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథి డి.ఎల్.పి.ఓ యాదయ్య చేతుల మీదుగా ప్రమాణ పత్రాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు.